'లాల్‌బాగ్చా రాజా' గణపతి వద్ద వీఐపీ కల్చర్ పై వ్యాపారవేత్త హర్ష్‌ గొయెంకా ట్వీట్‌

84பார்த்தது
'లాల్‌బాగ్చా రాజా' గణపతి వద్ద వీఐపీ కల్చర్ పై వ్యాపారవేత్త హర్ష్‌ గొయెంకా ట్వీట్‌
ముంబైలో ప్రసిద్ధి చెందిన 'లాల్‌బాగ్చా రాజా' గణపతి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. అయితే ఇక్కడ వీఐపీ సంస్కృతి అమలుచేయడంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గొయెంకా స్పందించారు. "ఈ ఉత్సవంలో వీఐపీ సంస్కృతి అమలుచేయడం అవసరమా?. ఈ విధానం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. విశ్వాసం అనేది అందరికీ సమానం కాదా?" అని గోయెంకా ప్రశ్నించారు. ఈ మేరకు భక్తులను భద్రతా సిబ్బంది తోసివేస్తున్న వీడియోను 'ఎక్స్'లో షేర్ చేశారు.

தொடர்புடைய செய்தி