తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే గందరగోళంగా మారాయి. ఫార్ములా-ఈ రేసింగ్‌పై KTRపై కేసుపై అసెంబ్లీలో చర్చించాలని BRS ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRS ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై కౌంటర్లు వేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, BRS సభ్యులు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లను విసిరేసుకున్నారు. అయితే స్పీకర్‌పైకి BRS సభ్యులు పేపర్లు విసిరారని.. స్పీకర్ ను BRS ఎమ్మెల్యేలు అవమానించారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. దీంతో స్పీకర్ 15 నిముషాలు సమావేశాలను వాయిదా వేశారు.