తెలంగాణలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్‌లో ధర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన ధర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తోంది. ఈ మహా ధర్నాకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. కేటీఆర్ హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో మహబూబాబాద్‌కు బయలుదేరనున్నారు.