TG: ఏ పార్టీకైనా బీసీలే బ్యాక్ బోన్ లాంటివాళ్లు. వాళ్లు ఎవరికి మద్దతిస్తే వారికే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రాజకీయ పార్టీలు వేసే లెక్కలు. అయితే గత ఎన్నికల్లో బీసీలను లైట్ తీసుకోవడం వల్లే అధికారం కోల్పోయామనే భావనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. దీంతో దూరమైన బీసీలను దగ్గరకు తీసుకునేందుకు స్కెచ్ రెడీ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వారిని తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది.