గాంధీ, నెహ్రూల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్ స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్‌గా మార్చాడు.