బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 2019 నుంచి విదేశీ పర్యటనలకు భారత సీనియర్ క్రికెటర్లు వెళ్లే సమయంలో వారితో పాటు కుటుంబసభ్యులకూ బీసీసీఐ అనుమతి ఇచ్చేది. అయితే ఇక నుంచి ఏ విదేశీ పర్యటనకైనా భార్య సహా కుటుంబసభ్యులకు ఎవరికీ అనుమతి ఇచ్చే అవకాశం లేదని సమాచారం.