శుక్రవారం ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ

54பார்த்தது
శుక్రవారం ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ
సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన బీసీ మహాసభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. సభకు పర్మిషన్‌ ఇస్తారా లేదా అనే ఉత్కంఠకు తెరదించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని కోరుతూ బీసీ మహాసభను తలపెట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி