TG: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీతేజ్‌ను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రేవతి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించారు.