WPL: ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

65பார்த்தது
WPL: ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్
WPLలో ముంబై ఇండియన్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్‌తో గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలిచింది. మాథ్యూస్‌ (77), నాట్‌సీవర్‌ (77) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్‌ 3, అమేలియా కెర్‌ 2 వికెట్లు తీశారు. ఇక మార్చి 15న దిల్లీతో ఫైనల్‌‌లో ముంబై తలపడనుంది.

தொடர்புடைய செய்தி