AP: జాతరలో అసభ్య నృత్యాలు చేస్తుండగా ఓ మహిళా ఎస్‌ఐ అడ్డుకోవడంతో ఆమెపై యువకులు దాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలో జరిగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణలో భాగంగా కోర్టు తొమ్మిది మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.