గత కొంతకాలంలో దేశంలో వరుసగా పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపి పదుల సంఖ్యలో మావోయిస్టులను మట్టుపెడుతున్న విషయం తెలిసిందే. మార్చి 31న దంతెవాడ-బీజాపుర్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ పచ్చి అబద్ధమని మావోయిస్టులు ఓ లేఖలో ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకను అరెస్టు చేశారని, 3 గంటలు విచారించి ఇంద్రావతి నది ఒడ్డున దారుణంగా హత్య చేశారన్నారు. మార్చి 25న జరిగిన మరో ఎన్‌కౌంటరూ అబద్ధమేనని వారు రాసుకోచ్చారు.