దేశంలో ఎంతోమంది యువతీ యువకులు కలలుగంటున్న ‘సీఏ’ను అన్నా సెబాస్టియన్ డిస్టింక్షన్‌లో పాసయ్యారు. పుణేలోని ‘ఈవై గ్లోబల్’ కంపెనీలో ఈ ఏడాది మార్చి 18న చేరారు. ఛాతిలో నొప్పితో జూలై 20న హఠాత్తుగా ఆమె చనిపోయారు. ఆమె మరణం.. తల్లిదండ్రుల్ని షాక్‌కు గురిచేసింది. కంపెనీలో నాలుగు నెలలు రాత్రిపగలు తన కూతురుపై పని భారం మోపారని, సరిగా నిద్ర పోనివ్వకుండా అధిక పని ఒత్తిడి వల్లే ఆమె మరణించిందని తల్లి అనిత ఆరోపిస్తున్నారు.