తెలంగాణలో రేపటి నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతి రోజూ దాదాపు 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే నెల వరకు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు తగిన జాగ్రతలు తీసుకోవాలని IMD సూచించింది. చిన్నపిల్లలు, వృద్దులను బయటకు పంపొద్దని నిపుణులు చెబుతున్నారు.