యూపీలోని మీర్జాపుర్‌లో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ఇచ్చిన విందుపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. మజావాన్ అసెంబ్లీ స్థానానికి జరుగున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను వివిధ రకాల యుద్ధాలను చూశానని, కానీ ‘మటన్ యుద్ధం’మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని సెటైర్లు వేశారు. కాగా ఇటీవల ఎంపీ వినోద్ విందు ఏర్పాటు చేయగా కూరలో ముక్కలు లేవని అతిథులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.