కాగజ్ నగర్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాటుతున్న క్రమంలో అదుపుతప్పి లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి 10. 30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో రహదారిపై ప్రజలు, ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.