మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ దేనని మహిళ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మహిళా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను వివరించారు.