సింగరేణిలో అత్యవసర సిబ్బందికి, పీహెచ్డీలో పెట్టిన నిబంధనలను ఎత్తివేయాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, మైనింగ్, ఆపరేటర్స్, తదితర అత్యవసర సిబ్బందికి లోపభూయిష్టమైన నిబంధనలు ఉండటం సరికాదన్నారు.