కర్కగూడెం మండలం రఘునాధపాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్ పై విచారణకు వెళుతున్న పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు తదితరుల బృందాన్ని మణుగూరులో అరెస్ట్ చేయడాన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ అదిలాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. విచారణకు హక్కుల సంఘం నాయకులను వెళ్లనివ్వకపోవడం అన్యాయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జగన్ విమర్శించారు. ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని కోరారు.