తాంసి మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాలతో పాటు ఉన్నత పాఠశాలను గురువారం ఆర్డిఓ వినోద్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ, ఆర్ఐ సంతోష్, జానియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులున్నారు.