రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా జరుపుతున్న సీఎం కప్ 2024 పోటిల్లో గుడిహత్నూర్ మండల కేంద్రనికి చెందిన యువకుడు కళ్ళేపెల్లి ప్రకాష్ బుధవారం జిల్లా స్థాయిలో జరిగిన నెట్ బాల్ పోటిల్లో కూడా తన అద్భుత ప్రతిభను కనపరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యడు. ప్రకాష్ సోమవారం నిర్వహించిన రెస్లింగ్ పోటిల్లో జిల్లాస్థాయిలో రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికైన విషయం తెలిసిందే. ఆయనను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.