రైతు భరోసా ఎగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఅర్ఎస్ పార్ట్ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం రైతుల పట్ల వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించి సీఎం రేవంత్ డౌన్ డౌన్ నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.