తలమడుగు మండలంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థికి డెంగీ నిర్ధారణ కావడంతో బుధవారం వసతి గృహంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ హరీశ్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ హాస్టల్, పాఠశాల పరిసరాలను జిల్లా డిప్యుటీ డిఎంహెచ్ఓ సాధన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.