గంగాపూర్ గ్రామస్తులకు తోట రోడ్డు సౌకర్యం కల్పించాలి
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ 1వ వార్డు చల్లూరి హన్మంతు నుండి వాగుకి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని గ్రామస్థులు వాపోయారు. ఈ రోడ్డుకి గత 2015 లో అప్పటి సర్పంచ్ ముంజం రవీందర్ మట్టి పోయించారని.. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోడ్డుని పట్టించుకొనే వారే లేరని గంగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముంజం వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి ప్రజలకు తోట రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.