కొమురం భీం జిల్లా వాంకిడి మండలం పాటగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏనొలి కొలాంగూడ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడం వలన త్రాగు నీరుకి గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు అని బాధితులు తెలిపారు.