కాగజ్నగర్ పట్టణంలో రాత్రిపూట జులాయిల ఆగడాలు అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి ఆపరేషన్ ఛబూత్ర కార్యక్రమం చేపట్టారు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో సుమారు 30 మంది పోలీస్ సిబ్బంది ప్రధాన వీధులు, చౌరస్తాలలో పెట్రోలింగ్ నిర్వహించారు. అతివేగంతో వెళ్తున్న 20 బైక్ లను స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శంకరయ్య, ఎస్సైలు దికొండ రమేష్, సుధాకర్, అనిల్, రాజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.