ఆదిలాబాద్‌లోని డైట్ కళాశాలలో తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో వస్తున్న మార్పుల గమ్యం ఎటువైపు అంశంపై సభ్యులు చర్చించారు. విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్యాముల్ మాట్లాడుతూ. జాతీయ విద్యావిధానాన్ని తిరస్కరించాలన్నారు. కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేశారు.