కబడ్డీ ఆడుతుండగా.. గుండెపోటుతో యువకుడి మృతి

77பார்த்தது
కబడ్డీ ఆడుతుండగా.. గుండెపోటుతో యువకుడి మృతి
AP: కబడ్డీ ఆడుతూ గుండెపోటుకు గురై యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో జరిగింది. తుడిచెర్లలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో జూపాడుబంగ్లాకు చెందిన కప్పెర ధనుంజయ్ కుమారుడు కప్పెర శ్రీరాములు (19) పాల్గొన్నాడు. కబడ్డీ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி