విద్యుత్ తీగ తెగి పడి మహిళ స్పాట్ డెడ్.. షాకింగ్ వీడియో

1537பார்த்தது
కర్ణాటకలో షాకింగ్ ఘటన జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బెంగళూరు దక్షిణ తాలూకాలోని చిక్కనహళ్లి గ్రామంలో విద్యుత్ వైరు తెగి పడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చిక్కనహళ్లి గ్రామానికి చెందిన మంజమ్మ(50)గా గుర్తించారు. సదరు మహిళ ఇంటి దగ్గర నిలబడి ఉండగా ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி