TG: నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఓ కేసు విషయంలో తన వద్ద డబ్బులు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిఖేష్ అనే యువకుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు తనను దారుణంగా వేధిస్తున్నారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్షణమే జాతీయ మానవ హక్కుల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు.