అఘోరీ ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది.. మామునూరు పోలీస్ స్టేషన్లో అఘోరీపై కేసు నమోదైంది. 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి కారణం.. నవంబర్ 19 న అఘోరీ వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు స్మశాన వాటికలో రెండు రోజులపాటు విడిది చేసింది. అక్కడ అఘోరీ బహిరంగంగా కోడిని బలి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన కొంత మంది యువత అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.