గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి

85பார்த்தது
గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి
యూపీలోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మౌంట్ ఫోర్ట్ స్కూల్‌లో మాన్వి సింగ్ (9) అనే బాలిక తోటి స్నేహితులతో ఆడుకుంటోంది. ఆ సమయంలో బాలికకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో గ్రౌండ్‌లోనే మాన్వి కుప్పకూలింది. బాలికను టీచర్లు సమీపంలోని ఫాతిమా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. గుండెపోటు కారణంగానే అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

தொடர்புடைய செய்தி