తెలంగాణలో గ్రూప్-3 పరీక్ష మొదటి రోజు ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఆదిలాబాద్ లో కొందరు ఆలస్యంగా రాగా నిమిషం నిబంధనతో వారిని అనుమతించలేదు. అప్పటికే అధికారులు గేట్లు మూసివేశారు. దీంతో 8 మంది అభ్యర్థులు కలెక్టర్ వద్ద మొర పెట్టుకున్నారు. పల్లెటూర్ల నుంచి వచ్చామని అనుమతించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమిలేక నిరాశగా వెనుదిరిగారు.