ఉంగుటూరు మండలం నారాయణపురం కోపరేటివ్ బ్యాంక్ సమీపంలో పైప్ లైన్ లీకు కారణంగా స్థానికులకు నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. గ్రామస్తులు పంచాయతీ దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ దిడ్ల అలకనంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. పంచాయతీ సిబ్బంది శ్రీను భుజంగరావు యాకోబు పాల్గొన్నారు.