ఉంగుటూరు మండలం పెద్ద వెల్లమిల్లి గ్రామంలో హైస్కూల్ వద్ద ఉపాధి హామీ నిధులు 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సి. సి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా మునుపెన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులకు సహకారం చుట్టడం జరిగిందన్నారు.