ఉంగుటూరు భీమేశ్వర దేవస్థానం ఆలయంలో దేవీ నవరాత్రులు ముగింపు సందర్భంగా కనకదుర్గమ్మ వారిని గ్రామంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని ఉంగుటూరు వద్ద ఏలూరు ప్రధాన కాలువలో ఆదివారం రాత్రి నిమజ్జన చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నారాయణ హనుమంతరావు, గ్రామ సర్పంచి బండారు సింధు, ఉప సర్పంచ్ జగదీష్, భద్రకాళి సేవాదళ్ చైర్మన్ పాతూరి వంశీకృష్ణ భక్తులు పాల్గొన్నారు.