ప్రశ్నిస్తే దాడులు చేయడం దారుణం: జనసేన

374பார்த்தது
ప్రశ్నిస్తే దాడులు చేయడం దారుణం: జనసేన
ప్రశ్నిస్తే దాడులు చేయడం దారుణమని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. మంగళవారం ఉంగుటూరు పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయిలో దళిత యువత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజల్లో ఆదరణ కోల్పోతుండటంతో ప్రతిపక్ష నాయకులు పై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. మహాసేన రాజేష్ ప్రభుత్వ పనితీరును నాయకుల అవినీతిని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు వారి బండారంబయట పెడుతుండటంతో ఆందోళన చెంది దాడులు దిగుతున్నారన్నారు.

అలాగే మహాసేన రాజేష్ అంబేద్కర్ ఆశయాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తుండటంతో వైసీపీ ప్రభుత్వం మరింత ఆందోళన చెంది ఆయన కారుపై గూండాలు దాడి చేయడం పిరికిపందల చర్యని విమర్శించారు ఈనెల 12వ తేదీ రణస్థలం జరిగే యువశక్తి పోస్టర్ను ధర్మరాజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గంగమోలు చిన్న రత్తయ్య, ఇల్లిందల సురేష్, మీసాల ప్రసాద్ బోనాల నారాయణ, కొమ్ము పెద్దిరాజు, వడ్డీ వెంకట్, దౌలురి సునీల్, పాకా ప్రేమ్ కుమార్, మూదునురి ప్రసాద్, తోట పవన్, గెడ్డం వెంకటేష్, బోయిన రాంబాబు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி