కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి

13892பார்த்தது
కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
కారు ఢీ కొని ద్వి చక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. జాతీయ రహదారి 216ఏ పై పూళ్ళ శివారు కోడురుపాడు రైల్వే గేటు వద్ద రోడ్ దాటుతున్న ద్విచక్ర వాహనదారుడిని తాడేపల్లిగూడెం వైపు నుండి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో తలకు బలమైన దెబ్బ కలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పుళ్ళ గ్రామానికి చెందిన నున్న కోటేశ్వర రావు (53)గా గుర్తించారు. మృతుడు వ్యవసాయం చేస్తూ, కమీషన్ పై ధాన్యం కొనుగోలు కూడా చేస్తుంటాడు. మృతునికి భార్య, ఒక కూతురు, ఒక కొడుకు సంతానం కలరు. మృతుని కుమారుడి ఫిర్యాదు పై భీమడోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி