వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం "ముఖ్యమంత్రి సహాయ నిధి" నుండి మంజూరైన రూ. 17, 13, 867/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణం రాజు లబ్ధిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సకాలంలో బాధితులకు ఆర్ధిక సహాయం అందజేస్తున్న ముఖ్యమంత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.