ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. ఈ సందర్భంగా మొత్తం 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఉండి మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన రామరాజుకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. దీంతో నాయకులు, కార్యకర్తలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.