కాళ్ల మండలం పెదమిరం గ్రామంలోని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 14, 85, 066 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు రఘురాం కృష్ణంరాజు అందజేశారు.