బీజేపీ అధికారం రెండో సారి చెప్పట్టినప్పటీ నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ కంపెనీల సేవలో తరిస్తూ, వారి కోట్ల అప్పులను మొండి బకాయిలుగా నిర్ధారించి రద్దు చేస్తూ, వారికి పన్నులు రాయితీలు ఇస్తూ, పేద ప్రజలపై పన్నుల రూపంలో మరింత భారం మోపుతోంది.
రైల్వే, పోస్టల్, రక్షణ, విమాన, తదితర ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, మూక దాడులకు పాల్పడడం వంటి అనేక బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ సీపీఐ, సీపీఎం, ఎంసీపిఐ(U) ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.