పాలకొల్లు పట్టణంలో పలుచోట్ల రహదారులు చిద్రమయ్యాయి. ప్రధానంగా భీమవరం నుండి పాలకొల్లు వెళ్లే రహదారిపై, పాలకొల్లు పట్టణం మినీ విక్టరీ బజార్ ఎదురుగా రహదారి అద్వానంగా తయారైంది. పెద్ద పెద్ద గోతులు పడి ప్రయాణించేందుకు వీల్లేకుండా ఉంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన గోతులను పూడ్చి, మరమ్మతులు చేయాలని ప్రయాణికులను ప్రమాదాల నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.