నిడదవోలు మండలం సామిశ్రగూడెం గ్రామంలో మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం పర్యటించారు. గ్రామంలో సీయోను ప్రార్థన మందిరం మూలరాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాస్టర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చర్చి విశ్వాసులతో పాటు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.