తుపాను హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రజల సౌకర్యార్థం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్లు కమిషనర్ భానుప్రతాప్ సోమవారం తెలిపారు. ప్రజలు సహాయ సహకారాలకు టోల్ ఫ్రీ నంబర్లు 08812 232101, 08812 222200ను సంప్రదించాలన్నారు.