ఏలూరులో స్థానిక సిపిఐ కార్యాలయంలో స్ఫూర్తి భవన్ నందు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో , ఏలూరు సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ జగన్ తన ఎన్నికల హామీ ప్రసంగంలో తాను అధికారులకు రాగానే పేదవాడికి సొంత ఇంటి కల సహకారం చేస్తానని మాట ఇచ్చి , రాష్ట్రం 32 లక్షల ఇళ్ల స్థలాన్ని పంపిణీ చేశారు అని అన్నారు.
ఆ స్థలం లబ్ధిదారులకు నిరుపయోగంగా ఉన్నాయని విమర్శించారు, ఊరికి దూరంగా శివారు ప్రాంతంలో చెరువులో గుంతలో ఉన్న స్థలాలను కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు ఇంటి నిర్మాణానికి ఇస్తున్న 1, 80, 000 చెరువులు గొంతులో పోర్చడానికి సరిపోతుందని అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టడం మూలంగా రుణభారం ఎక్కువ లబ్ధిదారులు దుర్భర జీవితం గడుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇసుక సిమెంట్ ఐరన్ ఉచితంగా పంపిణీ చేసి ఐదు లక్షల ఉచితంగా కేటాయించడం డిమాండ్ చేశారు , 90% పూర్తి అయినటి టిక్కు గృహాలకు సదుపాయాలు కల్పించి తక్షణం అందించాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈనెల 14 నుండి 30 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా కార్పొరేషన్ మున్సిపాలిటీ పట్టణ మండల ప్రాంతంలో ప్రజాజాత యాత్రలో నిర్వహిస్తామని ప్రజలు సిపిఐ అభిమానులు ప్రజా సంకల్ప యాత్రను పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉగాది నాటికి జగనన్న కాలనీ ఇల్లు గృహ ప్రవేశాలు చేయించి లబ్ధిదారులకు అందజేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం విఫలం చెందిందని, కేవలం పది శాతం కూడా పూర్తి చేయ లేదు అని ఆరోపించారు.
లబ్ధిదారులకు దూరపు ప్రాంతాలలో స్థలాలు కేటాయించడం వల్ల సదుపాయాలు ఉపాధి కరువై ఇళ నిర్మాణం చేపడానికి ఆసక్తి చూడడం లేదన్నారు, ప్రభుత్వం లబ్ధిదారులకు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉపాధి కల్పించడంతో పాటు కనీస సదుపాయాలు సమకూర్చి కాలనీ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ.. వామపక్షం వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాన్ని పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. పి డి ఎస్ యు ప్రధాన కార్యదర్శి కాకినేని మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తూ నియంతృత పొగడలను అనుసరిస్తున్నారని విమర్శించారు. చేనేత సంఘం జిల్లా కార్యదర్శి కడుపుకి అన్నయ్య ఏఐటియుసి నాయకులు పుప్పాల కన్నబాబు మహిళా సమైక్య జిల్లా కోదాస్ మావూరు విజయ తదితరులు మాట్లాడారు.. ఈ రౌండ్ వైపు సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొట్టేలు పెంటయ్య, సిపిఐ కార్యదర్శి ఎర్ర వెంకటరావు, కనకం జగన్, బుగ్గల ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ డాంగే, కాంగ్రెస్ పార్టీ నుండి దండుపోయిన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.