బిసీలను అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఏలూరు మండలం చొదిమెళ్లలో ఎంజేపీ గురుకుల పాఠశాలను గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల, హాస్టల్ పరిసరాలను పరిశీలించి భోజన సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.