టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మార్పులు, చేర్పుల ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుందని జంగారెడ్డిగూడెం తహశీల్దార్ స్లీవ్ జోజి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ మార్పులు , చేర్పులు చేసుకోవలసిన నియోజకవర్గంలోని టీచర్లు స్థానిక ఎంపీడీవో, మండల విద్యాశాఖ అధికారి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం వారిని ఓటర్లు గా చేరుస్తామన్నారు.