జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లపై గోతులు పడి వర్షపు నీరు నిలిచిపోయి చెరువులు తలపిస్తున్నాయి. ప్రధానంగా బస్టాండుకు వెళ్లే రోడ్డు, పాత మున్సిపాలిటీ కార్యాలయం, లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.