ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు ఐటిడీలకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాలకు ప్రత్యేక చట్టం తేవాలని అదేవిధంగా ఆదివాసీల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలన్నారు.