భీమవరంలో ఆదివారం రౌడీ షీటర్ దారుణ హత్య జరిగింది. భీమవరం టూ టౌన్ గొల్లవాని తిప్ప ప్రధాన రహదారి నందు ఉన్న కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కొన్ని హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న రౌడీ షీటర్ దేవరపు విజయ్(23)ను బైక్ పై తన ఇంటి వైపు వెళ్తుండగా వెనకనుంచి కారుతో గుద్ది గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ఎస్పి తెలిపారు. ప్రతీకార హత్య చోటుచేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.